పేదల సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నామని.. అందులో ఎలాంటి తప్పు లేదని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మంగళగిరిలో జరిగిన ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని నారాయణస్వామి కోరారు. అప్పులు కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేయటం లేదని కేంద్రం కూడా భారీగానే రుణాలు తీసుకుంటోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అప్పులు చేస్తున్నాయని గుర్తు చేశారు.
'పేదల సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నాం.. తప్పేంటి..?' - ap loans
రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసమే అప్పులు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలు అవసరాల కోసం అప్పులు చేయడం సహజమేనన్నారు.

Deputy Chief Minister narayana swami
పేదల సంక్షేమంకోసమే అప్పులు చేస్తున్నాం.. తప్పేంటి..?