రెండ్రోజుల్లో జరగనున్న రెగ్యులర్ విద్యార్థుల పరీక్షలకు.. తమను కూడా అనుమతించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్థులు ధర్నా చేపట్టారు. యాజమాన్య కోటాలో డీఎడ్ చదువుతున్న వారిని కూడా పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం అనుమతివ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ విద్యార్థులు వాపోయారు. విద్యాశాఖ అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తమ జీవితాలతో అధికారులు ఆడుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పరీక్షకు అనుమతించకుంటే ఆత్మహత్యే శరణ్యం: డీఎడ్ విద్యార్థులు
జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట డీఎడ్ యాజమాన్య కోటా విద్యార్థులు ధర్నా చేపట్టారు. రెండ్రోజుల్లో జరగనున్న రెగ్యులర్ విద్యార్థుల పరీక్షలకు.. తమను కూడా అనుమతించాలని కోరారు.
డీఎడ్ విద్యార్థులు