CPM State Secretary Srinivas Rao: తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ పాలన చూసి... వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపించారు. సెప్టెంబర్ 12 నుంచి అమరావతి నుంచి అరసవెల్లి వరకు రైతులు చేపట్టబోయే మహా పాదయాత్రకు మద్దతుగా సీపీఎం నేతలు... బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉండవల్లి నుంచి తుళ్లూరు వరకు సాగిన బైక్ ర్యాలీని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌రావు ప్రారంభించారు. అమరావతి మద్దతుగా నినాదాలు చేశారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం చేస్తున్నాయని శ్రీనివాసరావు ఆరోపించారు. కేంద్రం తలుచుకుంటే రాజధానిలో నిర్మాణాలు జరుగుతాయన్నారు. కేంద్ర సంస్థల నిర్మాణాలైనా వేగంగా సాగేందుకు భాజపా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైకాపా, భాజపా రెండు రైతులకు ద్రోహం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఆకాంక్షించారు.
CPM Srinivas Rao: "జగన్ పాలన చూసి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుంది" - జగన్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆగ్రహం
CPM State Secretary Srinivas Rao: సీఎం జగన్ పాలన చూసి వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శీనివాస్రావు అన్నారు. రాజధానిపై హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు భాజపా, వైకాపా ద్రోహం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
సీపీఎం