ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం' - cpm

భాజపా ప్రభుత్వంలో పేదరికం పెరిగిపోతోందని... దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అమర్​నాథ్ యాత్రను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో పార్లమెంట్​లో సమాధానం చెప్పాలని ప్రధాని మోదీని ఆయన డిమాండ్ చేశారు.

సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం: సీతారాం ఏచూరి

By

Published : Aug 3, 2019, 12:30 PM IST

Updated : Aug 3, 2019, 12:38 PM IST

'సీపీఎం తరపున మరో స్వాతంత్య్ర పోరాటం'

దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతోందని... ఆటోమొబైల్ రంగం తీవ్రంగా పతనమైందని గుంటూరులో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. 8 ముఖ్య రంగాల్లో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి 0.5 శాతం మాత్రమేనని మూడు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించారు. రైల్వేలో క్రమంగా ప్రైవేటీకరణ పెంచుతున్నారని ఆయన తెలిపారు. భాజపా ప్రభుత్వం తీరుతో దేశంలో పేదరికం ఇంకా విస్తరిస్తోందని ఆరోపించారు. చర్చకు అవకాశం లేకుండానే పార్లమెంటులో 26 బిల్లులు ఆమోదించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం తీరుపైసీపీఎం తరఫున మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తామని సీతారాం అన్నారు. మిగతా వామపక్షాలతో కలిపి ఈ పోరాటం సాగించనున్నట్లు ఆయన తెలిపారు.

అమర్‌నాథ్‌ యాత్ర నిలపడం సరికాదు..
అమర్‌నాథ్‌ యాత్రను ఆకస్మికంగా నిలిపివేయడం సరికాదని సీతారాం ఏచూరి అన్నారు. యాత్ర ఎందుకు నిలిపివేశారో పార్లమెంటులో కేంద్రం చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి-321@చినుకు జాడలేని మండలాలు

Last Updated : Aug 3, 2019, 12:38 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details