గుంటూరు జిల్లా రాజుపాలెం గ్రామంలో అత్యాచారానికి గురై జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య మరవకముందే ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో మహిళలకు,ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? అని ప్రశ్నించారు. వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైన లేదని దుయ్యబట్టారు. ఆడపిల్లలకు దిశా చట్టం రక్షణ కవచంలా పని చేస్తుందని చెబుతున్నా.. అలాంటి పరిస్థితులు కనిపించటం లేదన్నారు. అత్యాచారానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: సీపీఐ రామకృష్ణ
రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. గుంటూరు జిల్లా రాజుపాలెం గ్రామంలో అత్యాచారానికి గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. అత్యాచారానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
cpi ramakrishna