సీఎం జగన్మోహన్ రెడ్డి... తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని... రాజకీయ దురుద్దేశంతోనే మూడు రాజధానులంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా... పరిపాలన సజావుగా చేయలేకపోతున్నారని... అధికారం చేతికొచ్చిన ఆరు మాసాల్లో రాష్టాన్ని అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. రాజధానిపై సరైన నిర్ణయం ప్రకటించకుండా చెవిలో పువ్వులు పెడుతున్నారన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా గుంటూరులో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
'ఆరు మాసాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు' - prathipati pullarao on amaravathi latest
వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇబ్బందులే తప్ప... రాష్ట్రాభివృద్ధి శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
!['ఆరు మాసాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు' amaravathi-capital-and-cm-jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5576717-418-5576717-1578033405192.jpg)
'ఆరు మాసాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు'