ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొడాలి నాని వ్యాఖ్యలపై సీపీఐ నిరసన - గుంటూరులో సీపీఐ నిరసన

రాజధానికి కోసం ఇచ్చిన భూములను.. ఇళ్ల స్థలాలకు కేటాయించాలనుకోవడం బుద్ధిమాలిన చర్య అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి కొడాలి నాని వంటి వారి వల్ల.. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆదరణ కోల్పోతోందని హెచ్చరించారు.

cpi protest for kodali nani
cpi protest for kodali nani

By

Published : Sep 8, 2020, 11:45 PM IST

అమరావతిలో రాజధాని లేకుండా చేస్తామని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించడం సరికాదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మార్గమధ్యలో మంత్రి కొడాలి నాని దిష్టి బొమ్మను తగలపెట్టేందుకు ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details