ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎస్పీబీ మరణం సంగీత లోకానికి తీరని లోటు' - బాలసుబ్రహ్మణ్యం మరణం

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత లోకానికి తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచారం వ్యక్తం చేశారు. బాలు మృతికి సంతాపం.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

cpi-national-secretary-narayana-on-sp-balus-death
'ఎస్పీబీ మరణం సంగీత లోకానికి తీరని లోటు'

By

Published : Sep 25, 2020, 5:01 PM IST

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని వ్యాఖ్యానించారు. సంగీత, సాహిత్య లోకానికి ఆయన మారుపేరుగా నిలిచారని నారాయణ కొనియాడారు. చిన్నతనం నుంచే తనకు బాలుతో పరిచయం, సాన్నిహిత్యం ఉందని తెలిపారు. బాల సుబ్రహ్మణ్యం వల్ల వేలాది మంది కళాకారులు తయారయ్యారన్నారు. బాలు మృతి సంగీత లోకానికి తీరని లోటన్న ఆయన.. ఈ సందర్భంగా బాలు మృతికి సంతాపం.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details