ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CPI Narayana: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: సీపీఐ నారాయణ

CPI Narayana: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మన రాష్ట్ర గవర్నర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.

CPI Narayana
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి

By

Published : Mar 8, 2022, 3:17 PM IST

CPI Narayana: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో జగన్ పాలనను సరిదిద్దాల్సిన గవర్నర్.. సీఎంకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మన రాష్ట్ర గవర్నర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని చెప్పారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇక్కడ కళాశాలలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి

ABOUT THE AUTHOR

...view details