ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిర్బంధ ఏకగ్రీవాలు ఇప్పుడే చూస్తున్నా' - cpi narayana comments cm jagan

గుంటూరులో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాత గుంటూరులో 8వ వార్డు అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా ప్రచారం చేశారు. వైకాపా... నిర్బంధ ఏకగ్రీవాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

cpi narayana  on ysrcp government
cpi narayana on ysrcp government

By

Published : Mar 4, 2021, 1:23 PM IST

Updated : Mar 4, 2021, 3:32 PM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ఎన్నికల్లో వైకాపా అరాచకాలు అన్నీ ఇన్నీ కావని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇంత అధికార దుర్వినియోగం ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. గుంటూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాత గుంటూరులో 8వ వార్డు అభ్యర్థి జంగాల రమాదేవికి మద్దతుగా... తెదేపా నేత నసీర్ అహ్మద్, తెదేపా మేయర్ అభ్యర్థి నానితో కలిసి ప్రచారం చేశారు.

'నిర్బంధ ఏకగ్రీవాలు ఇప్పుడే చూస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలకు ఓట్లు రావని భయమా? విశాఖ ఉక్కునూ అమ్మేస్తున్నారు'-నారాయణ, సీపీఐ నేత

స్థానిక ఎన్నికల్లో తెదేపాతో స్నేహపూర్వక పొత్తుతో వెళ్తున్నామని నారాయణ స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఉమ్మడిగా కొనసాగే అవకాశముందన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని పేర్కొన్నారు.

'విశాఖలో స్వరూపానంద స్వామిని యాదృచ్ఛికంగా కలిశా. వ్యక్తిగతంగా ఒకరి అభిప్రాయాన్ని మరొకరితో పంచుకున్నాం. మేం నాస్తికులం కాదు.. దేవుడనే భావనకు వ్యతిరేకం కాదు'- నారాయణ, సీపీఐ నేత

ఇదీ చదవండి:

'ఫిర్యాదులను ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది'

Last Updated : Mar 4, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details