రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉందని.. ప్రభుత్వ సేవలతో పాటు, స్వచ్ఛంద సంస్థలు కూడా కరోనా బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు సీపీఐ జిల్లా కార్యాలయంలో వంద మందికి కరోనా అత్యవసర మందుల కిట్లను ఆయన పంపిణీ చేశారు. కొవిడ్ మొదటి దశలో నివారణ మందులు అందించడంలో ప్రపంచానికి మార్గదర్శకంగా భారత్ నిలిచిందన్నారు.
ప్రధాని మోదీ పాలనా వైఫల్యం, బాధ్యతారాహిత్యం, ముందుచూపు లేని కారణంగా భారత్లో.. రోజూ 4 లక్షల కేసులు, 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ మరణాలకు, కోవిడ్ విలయతాండవానికి బాధ్యులైన మోదీకి మరణదండన విధించినా తక్కువేనన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మొదట ఆలస్యం చేసినా.. నేడు కొంత వేగం పుంజుకుందని అభినందించారు. ఆక్సిజన్ మరణాలకు రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.