Covid Cases : కొత్తగా 8,976 కరోనా కేసులు, 90 మరణాలు నమోదు - ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు
16:47 June 06
VJA_Corona bulletin_Breaking
రాష్ట్రంలో గత 24 గంటల్లో 83,690 నమూనాలు పరీక్షించగా 8,976 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్ బారిన పడి 90 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఫలితంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 11,466 కు చేరింది. గడచిన 24 గంటల్లో 13,568 మంది కొవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,23,426 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,669, చిత్తూరులో 1,232, అనంతపురంలో 995, కృష్ణాలో 726 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లాలో 12, పశ్చిమగోదావరిలో 9, అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంలో 8 మంది చొప్పున మృతి చెందారు.
ఇదీచదవండి: దివంగత నేత కాసు బ్రహ్మానందరెడ్డి సతీమణి రాఘవమ్మ మృతి