గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో నగరపాలక సంస్థ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్‌లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ చల్లా అనురాధ సూచించారు.
కేసులు ఎక్కువగా నమోదవుతోన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. పాజిటివ్‌గా తేలిన వారి వివరాలు వారి ప్రైమరీ కాంటాక్ట్స్ సేకరించాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వినియోగించడం చేయాలని ప్రజలకు సూచించారు.