Counterfeit notes:గుంటూరు జిల్లాలోని మేడి కొండూరులో నకిలీ నోట్లు కలకలం రేపాయి. గ్రామంలోని జండావద్ద ఉన్న సలీం దుకాణం వద్దకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. సరకులు కొనుగోలు చేసి రూ.200 నోటు ఇచ్చి వెళ్లిపోయారు. కాసేపటికి దుకాణాదారుడు పరిశీలించి చూడాగా అది నకిలీ నోటని తేలింది. స్థానికుల సాయంతో ఎట్టకేలకు నకిలీ నోటు ఇచ్చిన ఇద్దరు వ్యక్తులను పట్టు కున్నారు. పొరపాటు జరిగింది అని చెప్పి సదరు వ్యక్తులు మరో రూ.200 నోటు ఇచ్చి ద్విచక్ర వాహనంపై గుంటూరు వైపు వెళ్లి పోయారు.
గతంలోనూ ఇదే తరహా...
మేడి కొండూరు మండలం పేరేచర్ల లోని ఇలాంటి ఘటనే జరిగింది. మద్యం కొనుగోలు చేయడానికి కొన్ని నెలలు క్రితం ఇద్దరు వ్యక్తులు ద్వి చక్ర వాహనంపై వచ్చారు.మందు కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చారు. అది నకిలీ నోటు అని తెలుసుకున్న దుకాణ దారుడు మేడి కొండూరు పోలీసులకు పిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత పోలీసులే నిందితులను పట్టుకున్నారు. పేరేచర్ల లక్ష్మీనరసింహ కాలనీలో ఉండే ఇద్దరు వ్యక్తులు కలర్ జిరాక్స్ యంత్రం సాయంతో రాత్రిళ్లు నకిలీ నోట్లు తయారీ చేసి మేడికొండూరులో మార్పిడి చేస్తూ పోలీసులకు దొరికారు.
గుంటూరులో నకిలీ నోట్లు కలకలం ఇదీ చదవండి:అనిశా అధికారులకు చిక్కిన.. ఫిరంగిపురం పోలీసులు..!