ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు విద్యుత్ భవన్​లో కరోనా పరీక్షలు - corona at vidhyuth bhawan

గుంటూరు విద్యుత్ భవన్​లోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. రీడింగులు, బిల్లుల వసూళ్ల క్రమంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని ఎస్‌ఈ యం.విజయకుమార్ తెలిపారు.

corona tests at guntu vidhyuth bhawan
గుంటూరు విద్యుత్ భవన్ లో కరోనా పరీక్షలు

By

Published : Jul 7, 2020, 4:32 PM IST

గుంటూరు విద్యుత్ భవన్​లోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు. మార్చి నెలాఖరు నుంచి 50శాతం ఉద్యోగులే విధులకు హాజరు అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని ఎస్‌ఈ ఎం.విజయకుమార్ అన్నారు. ప్రాంగణం మొత్తం ఎప్పటికప్పుడు క్రిమి సంహారక ద్రావణం పిచికారి చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు మాస్క్ లు, సానిటైజర్లు, ఫేస్ షీల్డ్ లు ఇప్పటికే అందించామన్నారు. రీడింగులు, బిల్లుల వసూళ్ల క్రమంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details