ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా లక్షణాలతో గుంటూరు ఐడీ ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు - గుంటూరులో కరోనా వార్తలు

కరోనా లక్షణాలతో గుంటూరు జిల్లా ఐడీ ఆస్పత్రిలో ఓ వృద్ధుడు చేరాడు. ప్రకాశం జిల్లాకు చెందిన వృద్ధుడు తీవ్రజ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చిన వృద్ధుడి నమూనాలను వైద్యులు తిరుపతికి పంపించారు.

corona-suspect-in-guntur-hospital
corona-suspect-in-guntur-hospital

By

Published : Mar 20, 2020, 12:21 PM IST

గుంటూరు ఐడీ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు చేరాడు. ఇటీవలే హైదరాబాద్ నుంచి వచ్చిన అతను... తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. కరోనా అనుమానంతో అతని గొంతు నుంచి నమూనాలు సేకరించి తిరుపతికి పంపినట్లు ఐడీ ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపారు. అతని పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వృద్ధుడికి చికిత్స అందిస్తున్నామని... నివేదిక ఆధారంగా తదుపరి వైద్యం ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఐదు కరోనా అనుమానిత కేసులు రాగా... నలుగురికి నెగిటివ్ వచ్చింది. మరొకరి నివేదిక రావాల్సి ఉంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి... గత ఆదివారం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చినట్లు తేలటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఆసుపత్రి వైద్యులను, సిబ్బందిని ఐసోలేషన్​లోకి వెళ్లాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details