కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ మహిళను తీసుకెళ్లి... ఒక టాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపేసిన వైనం గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. ఎవరు తోడులేకుండా ఇంటికి పంపడంపై బాధిత మహిళ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఒక మహిళకు కరోనా సోకిందని శుక్రవారం.. అధికారులు గుంటూరుకు తరలించారు. అయితే బాధిత మహిళ ఇవాళ ఉదయం బంధువులకు ఫోను చేసి తాను నరసరావుపేట మల్లమ్మ సెంటరులో ఉన్నానని చెప్పడంతో బంధువులు ఆందోళన చెందారు.
ఓ మహిళను ఆరోగ్యం బాగోలేకపోతే... స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఫోన్‌కు సమాచారం వచ్చింది. అధికారులు ఆమెను ముందుగా చిలకలూరిపేట సమీపంలోని కొండ్రపాడుకు తరలించారు. తర్వాత గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.