ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్.. పరుగులు పెట్టిన అధికారులు! - ఏపీలో కరోనా కేసుల వార్తలు

దిల్లీ వెళ్లిన వారిద్దరిని ...క్వారంటైన్​లో ఉంచారు. కరోనా పరీక్షలు చేశారు. ఒకరికి పాజిటివ్​.. మరొకరికి నెగిటివ్ వచ్చింది. కానీ... నెగటివ్ వచ్చిన వ్యక్తిని కాకుండా పాజిటివ్​ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డు నుంచి ఇంటికి పంపించేశారు. తీరా అసలు విషయం తెలుసుకున్న అధికారులు పరుగులు పెట్టారు. ఆ వ్యక్తిని తిరిగి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ హైడ్రామాకు అంతా కారణం..వారిద్దరూ ఒకే పేరు కలిగి ఉండటమే. గుంటూరులో జరిగిన ఈ ఘటన అధికారులను ఉలిక్కి పడేలా చేసింది.

corona positive case
corona positive case

By

Published : Apr 19, 2020, 3:55 PM IST

Updated : Apr 19, 2020, 4:35 PM IST

గుంటూరు జిల్లాలో అధికారులు చేసిన పొరపాట్ల వల్ల కరోనా పాజిటివ్ రోగి ఇంటికి చేరారు. తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన ఓ వ్యక్తి దిల్లీ వెళ్లి రావడంతో అధికారులు ఆయన్ను క్వారంటైన్​కు తరిలించారు. అదే క్వారంటైన్​లో నులకపేటకు చెందిన వ్యక్తి పేరుతోనే మరో వ్యక్తి ఉన్నారు. ఇద్దరికీ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇద్దరిదీ ఒకే పేరు ఉండటంతో అధికారులు పొరపాటున పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఇంటికి పంపించారు.

తీరా అసలు విషయం తెలుసుకున్న అధికారులు తాము చేసిన పొరపాటును గుర్తించి ఇంటికి పంపిన వ్యక్తిని మళ్లీ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మొదట పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఐసోలేషన్ కు వెళ్లేందుకు నిరాకరించారు. తనకు అధికారులు గుర్తింపు పత్రం ఇచ్చారని... నేను రానని మొండికి వేయడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు... పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అంబులెన్స్​లో ఐసోలేషన్​కు తరలించారు.

Last Updated : Apr 19, 2020, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details