ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమపై కొవిడ్ ప్రభావం - Guntur District Latest News

గుంటూరు జిల్లాలో బంగారు ఆభరణాల తయారీపై కొవిడ్ గట్టి ప్రభావమే చూపింది. ఆభరణాల తయారీలో పేరొందిన బంగాల్ కార్మికులు.. సొంతూళ్లకు వెళ్లిపోవటంతో లావాదేవీలకు ఆటంకం ఏర్పడింది. కరోనా కారణంగా అంతంతమాత్రంగా సాగుతున్న వ్యాపారాలు.. ఇప్పుడు కార్మికుల కొరతతో మరింత డీలా పడ్డాయని యజమానులు ఆవేదన చెందుతున్నారు.

బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమపై కొవిడ్ ప్రభావం
బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమపై కొవిడ్ ప్రభావం

By

Published : Apr 29, 2021, 6:28 PM IST

బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమపై కొవిడ్ ప్రభావం

గుంటూరులో వెయ్యివరకు బంగారు ఆభరణాల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఆభరణాల తయారీ పనులు చేసేవాళ్లలో.. ఎక్కువమంది పశ్చిమబంగాల్ వాళ్లే. ఎందుకంటే.. ఆభరణాల తయారీలో బంగాల్‌ కార్మికులు పనిమంతులనే పేరుంది. అందువల్లే గుంటూరు బంగారం దుకాణాలు, కార్ఖానాల్లో దాదాపు 3వేల మంది బంగాలీ కార్మికులు ఉన్నారు.

కొవిడ్ రెండో విడత ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా.. నెల రోజుల వ్యవధిలో రెండున్నర వేల మందికి పైగా సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. కార్మికులు కొరతతో ఆభరణాల తయారీపై తీవ్ర ప్రభావం పడింది. స్థానిక కార్మికులతో నెట్టుకొస్తున్నా.. ఆర్డర్లు తగిన సమయానికి సిద్ధం చేయలేని పరిస్థితి నెలకొంది.

గత లాక్‌డౌన్ అనుభవాలే.. కార్మికులు సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోవడానికి కారణమైంది. అప్పట్లో పనిలేక, ఇక్కడ ఉండలేక, సొంతూళ్లకు వెళ్లే మార్గం కానరాక నానా పాట్లు పడ్డారు. రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేశారు. ఆ పరిస్థితులు వెంటాడంతోపాటు.. ఇప్పుడు ఎవరికైనా కరోనా వస్తే ఇక్కడ పట్టించుకునే వాళ్లెవరూ లేరనే భయంతో చాలామంది వెళ్లిపోయారని సహచర కార్మికులు చెబుతున్నారు. రైలు టికెట్ దొరికితే తాము కూడా వెళతామని అంటున్నారు.

ఇక్కడ కరోనా తీవ్రంగా ఉంది. బంగాల్‌లోని సొంతూరికి వెళ్లేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాం. కానీ రైలు టికెట్ దొరడం లేదు. మేం ఊరికి వెళ్లడానికి సాయం చేయండి. ఇక్కడ మాకు ఏదైనా జరిగితే చూసేవాళ్లెవరు ఉన్నారు..?-గణేశ్‌, బెంగాలీ కార్మికుడు

ఇక చీరలపై డిజైన్లు, మగ్గం పనుల్లోనూ బంగాల్ కార్మికులది అందెవేసిన చేయి. 2వేల మందికి పైగా ఉన్న ఈ కార్మికుల్లోనూ అత్యధికులు కొవిడ్ కారణంగా స్వరాష్ట్రానికి వెళ్లారు.

ఇదీ చదవండీ... ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details