కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా గుంటూరు రైల్వే సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్టేషన్ పరిసరాలను శుభ్ర చేశారు. ప్రయాణికులకు వైరస్ గురించి అవగాహన కల్పించారు. స్టేషన్ పరిధిలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనుమానితులను స్థానిక రైల్వే ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు సౌకర్యం కోసం ముందస్తు చర్యలు తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రైల్వే స్టేషన్లో.. కరోనా నివారణ చర్యలు - గుంటూరు రైల్వే స్టేషన్లో కరోనా దృష్ట్యా ముందస్తు చర్యలు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. గుంటూరులో రైల్వేధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టేషనులో పరిశుభ్రతతో పాటుగా ప్రయాణికులకు కరోనా నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.
'గుంటూరు రైల్వే స్టేషన్లో కరోనా దృష్ట్యా ముందస్తు చర్యలు'