గుంటూరు జీజీహెచ్ డ్రగ్ స్టోర్లో విలువైన మందులు మాయమయ్యాయి. కరోనా చికిత్సకు వినియోగించే ఖరీదైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ల బాక్సును అక్కడ ఓ ఉద్యోగి తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆసుపత్రికి సంబంధించి కీలకమైన డ్రగ్స్ స్టోరులో సీసీ కెమెరాలు లేనట్లు ఆసుపత్రి అధికారులు గుర్తించారు. మందుల అక్రమ తరలింపుపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ప్రభావతి తెలిపారు.
గుంటూరు జీజీహెచ్లో కరోనా మందులు మాయం - గుంటూరు జీజీహెచ్ తాజా వార్తలు
గుంటూరు జీజీహెచ్ డ్రగ్ స్టోర్ నుంచి కరోనా చికిత్సకు వినియోగించే రెమిడిసివిర్ మందులు మాయం అయినట్లు గుర్తించారు. వీటిని అక్కడ పనిచేసే ఉద్యోగి తరలించినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జీజీహెచ్ నుంచి కరోనా మందులు మాయం