ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా భయం.. 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం..!

కరోనా మరణాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. బతికున్నంత వరకే మనుషుల మధ్య బంధాలు, ఆప్యాయతలు ఉంటాయా.. అన్న రీతిలో సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు మానవత్వపు ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపేందుకు ఆ నలుగురు లేక.. అందరూ ఉన్నా.. భయంతో ఎవరూ ముందుకు రాక.. వారి మృతదేహాలు దిక్కులేని శవాల్లా రహదారిపై దర్శనమిస్తున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన హృదయవిదారక ఘటన వివరాలివి..!

కరోనా భయం.. నాలుగు గంటలుగా రహదారిపైనే మృతదేహం..!
కరోనా భయం.. నాలుగు గంటలుగా రహదారిపైనే మృతదేహం..!

By

Published : Jul 19, 2020, 5:49 PM IST

నాలుగు గంటలుగా రహదారిపైనే మృతదేహం

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అమానవీయ ఘటన జరిగింది. ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చిందని వాలంటీరు చెప్పగా.. అంబులెన్స్​ కోసం ఎదురుచూశారు. ఎంతసేపటికీ అంబులెన్స్​ రాకపోవడం వల్ల ఆస్పత్రికి వెళ్లేందుకు బాధితుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈలోపు ఆయాసంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.

కరోనా భయంతో బంధువులు సహా గ్రామస్థులు ఎవరూ మృతదేహాన్ని తీసుకెళ్లలేదు. 5 గంటలుగా రహదారిపైనే మృతదేహం పడి ఉంది. అనంతరం స్పందించిన పురపాలక సిబ్బంది హిందూ మహా ప్రస్థానం సహాయంతో మృతదేహాన్ని తరలించారు. హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details