గుంటూరు జిల్లాలో కొవిడ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. కేసుల పరంగా నాలుగో స్థానంలో ఉన్న జిల్లా మరణాల సంఖ్యలో అగ్రస్థానానికి చేరింది. జిల్లాలో ఇవాళ కొత్తగా 595 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26 వేల 32కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 189 ఉన్నాయి. ఆ తర్వాత మాచర్లలో 67, నరసరావుపేట 33, పిడుగురాళ్ల 25, తెనాలి 21, క్రోసూరు 19, పెదకాకాని 19, అమరావతి 17, రేపల్లె 16, దాచేపల్లి 16, చిలకలూరిపేట 15, మేడికొండూరు 11, తాడేపల్లి 11, నగరం 10, చెరుకుపల్లి, తాడికొండలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 143 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
జిల్లాలో కరోనా నుంచి 16 వేల 310 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వల్ల ఇప్పటి వరకూ జిల్లాలో 265 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక కరోనా మరణాలు గుంటూరు జిల్లాలో సంభవించినట్లయింది. మరణాల పరంగా అగ్రస్థానంలో ఉండటం అధికారుల్ని కలవరపరుస్తోంది.