ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 609 పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి తగ్గలేదు. శనివారం జిల్లాలో మరో 609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 27 వేల 168కు చేరాయి. ఇవాళ కరోనా వల్ల 9 మంది మరణించారు. వీటితో 284 మందికి మృతుల సంఖ్య చేరింది. కరోనా మరణాల్లో గుంటూరు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది.

గుంటూరు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 609 పాజిటివ్ కేసులు
గుంటూరు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి.. కొత్తగా 609 పాజిటివ్ కేసులు

By

Published : Aug 15, 2020, 10:33 PM IST

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 609 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో కేసుల సంఖ్య 27వేల 168 కి చేరుకుంది. కొత్త కేసుల్లో గుంటూరు నగరంలోనే 106 ఉన్నాయి. జిల్లాలోని మాచర్లలో 90, నరసరావుపేట 74, చిలకలూరిపేట 47, గురజాల 42, సత్తెనపల్లి 35, మంగళగిరి 27, రెంటచింతల 27, పిడుగురాళ్ల 17, దాచేపల్లి 11, ఫిరంగిపురం 11, రొంపిచర్ల 11, గుంటూరు గ్రామీణం 10, తెనాలి 10, అమరావతిలో 10 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. మిగతా మండలాల్లో 81 కేసులు వచ్చాయని వివరించారు.

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 9 మరణాలు సంభవించాయి. వీటితో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 284కు చేరుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. కరోనా మరణాల్లో ఎక్కువమంది 60 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. అయితే 30 సంవత్సరాల లోపు వారు కూడా 13 మంది మరణించటం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 17 వేల 554కు చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకూ 2 లక్షల 43 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రకారం పాజిటివ్ కేసులు 10 శాతం పైగానే తేలాయి.

ABOUT THE AUTHOR

...view details