ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు జిల్లాలో 583కు చేరిన కరోనా కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసుల వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా.. ఆరుగురికి పాజిటివ్​ నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 583కి చేరింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

గుంటూరు జిల్లాలో 583కి చేరిన కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో 583కి చేరిన కరోనా కేసులు

By

Published : Jun 9, 2020, 8:22 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. తాజాగా.. నల్లపాడు, కేవీపీ కాలనీ, మద్దిరాల కాలనీ, లక్ష్మీపురం, దాచేపల్లి, నరసరావుపేటలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం కేసుల సంఖ్య 583కు చేరింది. గుంటూరు నగరంలో 222.. నరసరావుపేటలో 202 కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details