కరోనా కేసులు మొదటి నుంచి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. జిల్లాలో శనివారం నాడు కొత్తగా 393 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 54 వేల 313కు చేరుకుంది. అలాగే జిల్లాలో ఇవాళ కొత్తగా 3 మరణాలు సంభవించాయి. వీటితో కరోనా మరణాల సంఖ్య 514కు చేరుకుంది. ఇప్పటి వరకు కొవిడ్ నుంచి కోలుకుని 46 వేల 89 మంది ఇళ్లకు చేరుకున్నారు.
ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో గుంటూరు నగరంలోనే అత్యధికంగా 58, బాపట్లలో 44, ఉన్నాయి. ఇక జిల్లాలోని తాడేపల్లిలో 35, నర్సరావుపేట 32, మంగళగిరి 26, రేపల్లె 26, ముప్పాళ్ల 24, వట్టిచెరుకూరు 18, చిలకలూరిపేట 13, ప్రత్తిపాడు 12, పెదకాకాని 11, కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బులిటెన్ విడుదల చేశారు. మిగతా మండలాల్లో 96 కేసులు వచ్చాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకూ 5లక్షల 7వేల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 15 వేలు దాటాయి. నర్సరావుపేట పట్టణంలో 3వేల 659, తెనాలి పట్టణంలో 2వేల 376 కేసులు నమోదయ్యాయి.