గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48 వేల 264కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 38వేల 997 మంది ఇంటికి చేరుకున్నారు. తాజాగా వైరస్ ప్రభావంతో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 469కి చేరింది.
జిల్లాలో కరోనా విజృంభణ.. నలుగురు మృతి - గుంటూరు జిల్లాలో కరోనా వార్తలు
గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా జిల్లాలో 502 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 48,264 కు చేరుకుంది.
రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 106 కేసులు నమోదయ్యాయి. ఇక మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట-64, బాపట్ల-36, రొంపిచర్ల-29, పెదకాకాని-28, తాడేపల్లి-28, నకరికల్లు-18, పెదకూరపాడు-16, కొల్లూరు-16, పిడుగురాళ్ల-15, చిలకలూరిపేట-14, పెదనందిపాడు-12, మంగళగిరి-11, గుంటూరు గ్రామీణ ప్రాంతం-10 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:ఆక్స్ఫర్డ్ టీకా ట్రయల్స్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్