గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 516 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 47,762 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 38,300 మంది కోలుకున్నారు. తాజాగా వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 465కి చేరింది.
రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 149 కేసులు ఉన్నాయి. మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట-102, తుళ్లూరు-39, వినుకొండ-35, గుంటూరు గ్రామీణ ప్రాంతం-24, పిట్టలవానిపాలెం-19, సత్తెనపల్లి-13, తెనాలి-13, తాడేపల్లి-13, దుర్గి-13, రొంపిచర్ల-11, తాడికొండ-10, చేబ్రోలు-10 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.