ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 7,952కు చేరిన కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 577 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 7,952కు చేరింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్తగా 22 కంటైన్మెంట్​ జోన్లను అధికారులు ప్రకటించారు. ప్రజలు నిబంధనలు పాటించి.. జాగ్రత్త వహించాలని సూచించారు.

By

Published : Jul 21, 2020, 10:47 PM IST

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 7,952కు చేరిన కేసులు
జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 7,952కు చేరిన కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 577 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధారణయ్యింది. సోమవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 716 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు కార్పొరేషన్​ పరిధిలోనే 292 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,952కు చేరింది. మొత్తం 63 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు నగరంతో పాటు సత్తెనపల్లి, నరసరావుపేట, తెనాలిలో కరోనా ఉద్ధృతి హడలెత్తిస్తోంది.

కేసుల వివరాలు

ప్రాంతం కేసులు
తెనాలి 69
సత్తెనపల్లి 48
నరసరావుపేట 33
చిలకలూరిపేట 23
చుండూరు, దాచేపల్లి 19
రేపల్లె, మాచవరం, పిడుగురాళ్ల 16
బాపట్ల 13
తుళ్లూరు, ప్రత్తిపాడు, మంగళగిరి 8

చెరుకుపల్లి, తాడికొండ, పెదనందిపాడు,

వినుకొండ, రాజుపాలెెం, అమరావతి

5

జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులతో సమీక్షించారు. కొత్తగా 22 కంటైన్మెంటు జోన్లను ప్రకటిస్తూ జిల్లా పాలనాధికారి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా అనుమానిత లక్షణాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు నిర్దేశించారు.

ఇదీ చూడండి..

సీతానగరం ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

ABOUT THE AUTHOR

...view details