Home Minister Sucharitha: గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్బీకే నిర్మాణ స్థలంపై వివాదం నెలకొంది. ఏళ్ల తరబడి దైవ కార్యక్రమాలకు వినియోగిస్తున్న స్థలంలో ఆర్బీకే నిర్మాణం చేపట్టడం ఏంటని కొందరు మండిపడుతున్నారు. అది పంచాయతీకి సంబంధించిన చెరువు స్థలమని... ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్మాణాలు చేసుకోవచ్చని వైకాపా నాయకులు చెబుతున్నారు. మరోవైపు మరికాసేపట్లో ఆ స్థలంలో హోంమంత్రి మేకతోటి సుచరిత ఆర్బీకే నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
ఆర్బీకే నిర్మాణ స్థలం విషయంలో వివాదం... కాసేపట్లో హోంమంత్రి శంకుస్థాపన - పెదనందిపాడులో ఆర్బీకే నిర్మాణ స్థలంపై వివాదం
Home Minister Sucharitha: గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్బీకే నిర్మాణానికి కాసేపట్లో హోంమంత్రి సుచరిత శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో స్థలంపై వివాదం నెలకొంది. ఏళ్ల తరబడి దైవ కార్యక్రమాలకు వినియోగిస్తున్న స్థలంలో ఆర్బీకే నిర్మాణం చేపట్టడంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
![ఆర్బీకే నిర్మాణ స్థలం విషయంలో వివాదం... కాసేపట్లో హోంమంత్రి శంకుస్థాపన Home Minister Sucharitha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14644156-340-14644156-1646464494890.jpg)
హోంమంత్రి సుచరిత శంకుస్థాపన
TAGGED:
RBK construction site issue