ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అచ్చెన్నాయుడు డిశ్ఛార్జి విషయంలో గందరగోళం - ఈఎస్​ఐ స్కాంలో అచ్చెన్న అరెస్ట్ వార్తలు

మాజీమంత్రి అచ్చెన్నాయుడు డిశ్ఛార్జి విషయంలో గందరగోళం ఏర్పడింది. అచ్చెన్నాయుడిని రేపటి నుంచి 3 రోజులపాటు జీజీహెచ్‌లోనే న్యాయవాది.. సమక్షంలో విచారించాలని అనిశా కోర్టు ఆదేశించింది. అయితే.. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రివేళ డిశ్చార్జి ఆర్డర్ ఇవ్వడంపై.. గందరగోళం నెలకొంది.

Controversy on atchannaidu discharge from ggh
Controversy on atchannaidu discharge from gghControversy on atchannaidu discharge from ggh

By

Published : Jun 25, 2020, 11:56 AM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడి డిశ్ఛార్జి విషయంలో గందరగోళం నెలకొంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రివేళ ఆసుపత్రి వర్గాలు డిశ్ఛార్జి ఆర్డర్ ఇచ్చాయి. ఎందుకు డిశ్ఛార్జి చేస్తున్నారంటూ.. అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది హరిబాబు ప్రశ్నించారు. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని ఏఆర్ఎంవో సతీష్ మెుదట తెలిపినా... కాసేపటికే డిశ్ఛార్జి రద్దు చేసినట్లు ప్రకటించారు.

ఈఎస్​ఐ అవకవతకల కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కొన్ని రోజుల కిందట అరెస్టు అయ్యారు. విచారణ చేపట్టిన అనిశా న్యాయస్థానం.. అచ్చెన్నకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రిలో చికిత్స అందించాలని తెలిపింది. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్​లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు. తాజా కస్టడీకి అనిశా అధికారులు అనుమతి కోరగా..మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయస్థానం అనుమతించింది. అయితే అచ్చెన్న డిశ్ఛార్జి విషయంలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది.

ABOUT THE AUTHOR

...view details