CONGRESS LEADERS PROTEST: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని విచారించడాన్ని నిరసిస్తూ.. విశాఖలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కార్యాలయం వద్ద.. కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దర్యాప్తు సంస్థల ద్వారా కాంగ్రెస్‌పై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు.
గుంటూరు: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని విచారించడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు. గుంటూరులోని పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేశారు. మోదీ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. ఎప్పుడో ముగిసిన కేసులో ఇప్పుడు ఈడీ చేత నోటీసులు ఇప్పించటం సరికాదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ కుటిల రాజకీయాలు చేస్తోందని.. ఇలాంటి చర్యలను ఆపకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు.