కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పేదలకు అందడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పేదల ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. రైతాంగం అతలాకుతలం అవుతున్నా.. ప్రభుత్వాలలో ఎలాంటి చలనం లేదని విమర్శించారు.
రైతాంగం ఇబ్బంది పడుతున్నా చలనం లేదా?: మస్తాన్ వలీ - వైకాపాపై కాంగ్రెస్ నేత మస్తాన్ వలి విమర్శలు
కరోనా వ్యాప్తి నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్తీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పేదలకు అందడంలేదన్నారు. లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్తీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి