రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాని(jagananna house)కి ప్రజా ప్రతినిధులు శంకు స్థాపనులు చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కలను నేరవేర్చుతామన్నారు.
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 17 వేల ఇళ్ల నిర్మాణానికి మొదటి విడతలో సీఎం శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ...
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లను నిర్మించి ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా ...
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం, ఒమ్మంగి గ్రామాల్లో జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేశారు. మొదటి విడతగా 8,490 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.
ప్రకాశం జిల్లా ...
ప్రకాశం జిల్లా మిల్లపల్లిలో వైఎస్సార్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణానికి మంత్రి ఆదిమూలపు సురేష్ శంకుస్థాపన చేశారు. అర్హులైన పేదవారికి సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. దసరా నాటికి ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.చీరాల మండలం పాతచీరాలలో గృహ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కరణం బలరాం శంకుస్థాపన చేశారు.
కృష్ణా జిల్లా...
కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో జగనన్న కాలనీల నిర్మాణానికి ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.
కర్నూలు జిల్లా