గుంటూరు జిల్లా బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై రాష్ట్రపతితో పాటు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదులు అందాయి. క్రైస్తవ మతంలోకి మారి కూడా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారని ముంబయికి చెందిన "దళిత్ పాజిటివ్ మూవ్మెంట్'' తమ ఫిర్యాదులో పేర్కొంది.
బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు - బాపట్ల ఎంపీ సురేశ్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు వార్తలు
బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ 'దళిత్ పాజిటివ్ మూవ్మెంట్' అనే సంస్థ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది.
complaint to president kovindh on ycp mp suresh over his election
1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం దళిత వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే.. ఎస్సీ హోదా ఉండదని, ఇదే అంశం ఆధారంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి.. సురేశ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరింది.
ఇదీ చదవండి : అవినీతికి పాల్పడితే మూడేళ్ల జైలు
TAGGED:
nandigam suresh