Complaint on 'Bhimla Nayak' movie: రాష్ట్ర శాలివాహన, కుమ్మర కార్పొరేషన్ ఛైర్మన్ పురుషోత్తమ్.. భీమ్లా నాయక్ చిత్రంపై గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కుండలు తయారు చేసే సారె(చక్రం)ను సినిమాలో కాలితో తన్నే సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సారె తమకు దైవంతో సమానమని... తమ మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అభ్యంతరకర దృశ్యాలను తక్షణమే తొలగించాలని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
bheemla nayak: 'భీమ్లా నాయక్' చిత్రంపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు - 'భీమ్లా నాయక్' చిత్రంపై కేసు
Complaint on 'Bhimla Nayak' movie: భీమ్లా నాయక్' సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయంటూ ఏపీ శాలివాహన, కుమ్మర కార్పొరేషన్ ఛైర్మన్ పురుషోత్తమ్.. గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాలో చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
'భీమ్లా నాయక్' చిత్రంపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రధారులుగా నటించిన 'భీమ్లానాయక్' చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది. మలయాళ సినిమా రీమేక్‌గా తెరకెక్కిన భీమ్లా నాయక్‌కు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాసి స్క్రీన్‌ప్లే అందించారు. భీమ్లానాయక్ దెబ్బకు బాక్సాఫీసు దద్దరిల్లిపోతోంది. మొదటి ముడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.