TDP Complaint on Kodali Nani: తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌పై వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడాలి నాని కృష్ణా జిల్లా పరువు తీస్తున్నారని మండిపడ్డారు. గూగుల్‌లో 420 అని సెర్చ్ చేస్తే సీఎం పేరే వస్తోందని ధ్వజమెత్తారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. మంత్రి పదవి పోయినా సిగ్గు రాలేదని దుయ్యబట్టారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే ప్రైవేటు కేసులు వేస్తామని స్పష్టం చేశారు. గుడివాడ నుంచి కొడాలి నానిని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలు దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
కొడాలి నానిపై ఫిర్యాదు.. నోరు అదుపులో పెట్టుకోవాలన్న తెదేపా నేతలు - వైకాపా రియాక్షన్ ఆన్ కొడాలి నాని కేసు
Kodali Nani: చంద్రబాబు, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ.. తెలుగుదేశం ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నానిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు పెడతామని స్పష్టం చేశారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/11-September-2022/16340453_tdp.jpg