ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'క్వారంటైన్​కు అంగీకరిస్తేనే... రాష్ట్రంలోకి అనుమతి' - గుంటూరు ఐజీ ప్రభాకర్ తాజా వార్తలు

కరోనా నేపథ్యంలో... జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనల ప్రకారం ఎక్కడివారక్కడే ఉండాలని గుంటూరు దక్షిణ కోస్తా ఐజీ ఉద్ఘాటించారు. తెలంగాణ నుంచి వచ్చిన వారు... క్వారంటైన్​లో ఉండేందుకు అంగీకరిస్తేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. లేదంటే తిరిగి వెళ్లిపోవచ్చన్నారు.

commuters not allowed
'క్వారంటైన్​కు అంగీకరిస్తేనే... రాష్ట్రంలోకి అనుమతి'

By

Published : Mar 26, 2020, 5:37 PM IST

'క్వారంటైన్​కు అంగీకరిస్తేనే... రాష్ట్రంలోకి అనుమతి'

రాష్ట్రంలోకి వచ్చేవారు తప్పనిరిగా 14 లేదా 28 రోజుల క్వారంటైన్ ను పాటించాల్సిందేనని గుంటూరు జిల్లా దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నివారణ, నియంత్రణకు అమలు చేస్తున్న నేషనల్ డిజాస్టర్ మేనేజ్​మెంటు నిబంధనల కింద ఎక్కడివారక్కడే ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దు వరకు రాకూడదని.. వచ్చినా క్వారంటైన్ తప్పదని చెప్పారు. తెలంగాణలో పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం.. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. గుంటూరులో కరోనా నియంత్రణ, లాక్ డౌన్ సమీక్ష సమావేశానికి హాజరైన ఐజీ... లాక్ డౌన్ విజయవంతంగా అమయ్యేందుకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details