ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కార్డియాలజికల్ సొసైటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రివెంటివ్ కార్డియాలజీ అంశంపై సదస్సు నిర్వహించారు. గుంటూరులోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బలును నివారించవచ్చని సూచించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వరల్డ్ హార్ట్ డేని ఒక ప్రత్యేక నినాదంతో పిలుస్తున్నారని లలిత హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రాఘవ శర్మ తెలిపారు. ఈ సారి 'బీ ఏ హార్ట్ హీరో... బై మేకింగ్ ప్రామిస్' అనే నినాదంతో గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రివెంటివ్ కార్డియాలజీ అంశంపై.. గుంటూరులో సీఎంఈ సదస్సు
రాష్ట్ర కార్డియాలజికల్ సొసైటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రివెంటివ్ కార్డియాలజీ అంశంపై సీఎంఈ సదస్సు నిర్వహించారు. ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
cme-seminar-in-guntur-on-world-heart-day