ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM tour: నేడు అనకాపల్లిలో సీఎం జగన్​ పర్యటన...ఇళ్ల పట్టాల పంపిణీ - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

CM jagan tour: నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన ఖరారైంది. జిల్లాల పర్యటన సమయంలో ఇళ్లపట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ పత్రాలు సీఎం జగన్​ పంపిణీ చేయనున్నారు.

CM Jagan tour
జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

By

Published : Apr 27, 2022, 3:10 PM IST

Updated : Apr 28, 2022, 6:05 AM IST

CM jagan tour: నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఉదయం 9.20కి తాడేపల్లి నుంచి బయలుదేరి... 10.40కి అనకాపల్లి జిల్లా... సబ్బవరం చేరుకోనున్నారు. ఉదయం 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం సహా లే అవుట్లను పరిశీలించనున్నారు. అనంతరం మోడల్‌ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్‌ ప్రారంభోత్సవం, ల్యాండ్‌ పూలింగ్‌ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్. తదితర కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఇళ్ల పట్టాలు, హౌసింగ్‌ స్కీమ్‌ మంజూరు పత్రాల పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

గవర్నర్​తో భేటీ: ముఖ్యమంత్రి జగన్ ఈ సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్‌తో సమావేశం కానున్నారు. విశాఖ పర్యటనకు వెళ్లి తాడేపల్లి వచ్చిన అనంతరం సాయంత్రం రాజ్‌భవన్‌కు సీఎం వెళతారు. ఇటీవలే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.... దిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను... కలసివచ్చారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, పరిపాలనకు సంబంధించి పలు కీలక అంశాలపై నివేదికలను... ప్రధాని, హోంమంత్రులకు గవర్నర్ అందించారు. ఈ నేపథ్యంలో ప్రధాని, హోంమంత్రి ఇచ్చిన ఆదేశాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వెళ్తున్నట్లు సమాచారం. వీటితో పాటు..రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనా గవర్నర్‌తో జగన్ చర్చించనున్నట్లు సమాచారం.


ఇదీ చదవండి: వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత

Last Updated : Apr 28, 2022, 6:05 AM IST

ABOUT THE AUTHOR

...view details