గృహ అవసరాల కోసం వినియోగించుకోవాల్సిన గ్యాస్ సిలిండర్లు గుంటూరులో పక్కదారి పడుతున్నాయి. రాయితీ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకోసం వినియోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై ఫౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 76 సిలిండర్లను స్వాధీనం చేసుకుని.. 28 హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై కేసులు నమోదు చేశారు. కేవలం వాణిజ్య సిలిండర్లను మాత్రమే వినియోగించాలని హోటల్ యజమానులను అధికారులు సూచించారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పేరుకే గృహావసరాలు... వినియోగించేది హోటళ్లలో... - గుంటూరులో పౌరసరఫరా శాఖ దాడులు
గుంటూరులోని పలు హోటల్లు, రెస్టారెంట్లపై పౌరసరఫరా అధికారులు దాడులు చేశారు. 76 రాయితీ సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
![పేరుకే గృహావసరాలు... వినియోగించేది హోటళ్లలో...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3184004-84-3184004-1556932198960.jpg)
గుంటూరులో పౌరసరఫరా శాఖ దాడులు- 76 సిలిండర్లు స్వాధీనం