ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇంటింటి సర్వే చేయండి.. పారిశుద్ధ్యాన్ని ముమ్మరం చేయండి' - guntur latest covid news

గుంటూరు నగరంలోని కంటైన్మెంట్​ జోన్లలో నగర కమిషనర్​ చల్లా అనురాధ పర్యటించారు. ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సర్వే రిపోర్ట్​ను మెడికల్​ అధికారి ధృవీకరణ చేసి ఆన్​లైన్​లో పొందుపరచాలని తెలిపారు.

city commissioner visits containment zone in guntur
కంటైన్మెంట్​ ప్రాంతాన్ని సందర్శించిన నగర కమిషనర్​

By

Published : May 7, 2020, 10:09 AM IST

కంటైన్మెంట్​ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని నగర కమిషనర్​ చల్లా అనురాధ అధికారులను ఆదేశించారు. గుంటూరులోని కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఆమె పర్యటించారు. ప్రతి ఇంటిని సర్వే చేయాలని, నివేదికను ఎప్పటికప్పుడు వైద్య​ అధికారి ధృవీకరణతో ఆన్​లైన్ లో పొందుపరచాలని చెప్పారు.

ఈవోలు సదరు ప్రాంతాల్లో సమగ్ర పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ప్రతి వీధిలో బ్లీచింగ్​ చల్లించాలని చెప్పారు. నిత్యం డిస్​ఇన్ఫెక్షన్​ పనులు ముమ్మరంగా నిర్వహించి, ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావొద్దని కోరారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో వారు ఫోన్​ చేస్తే వారికి కావాల్సిన సదుపాయాలు అందిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details