ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CHEATING: కాల్​ చేసి మీరే లక్కీ విన్నర్​ అన్నారు.. డబ్బు కట్టించుకుని.. - గుంటూరు వార్తలు

అమెజాన్ బంపర్ డ్రాలో కారు గెలుపొందారంటూ ఓ మహిళ నుంచి రూ. 30 వేలు వసూలు చేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. మోసపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు ప్రారంభమైంది.

CHEATING
CHEATING

By

Published : Sep 27, 2021, 2:34 AM IST

అమెజాన్ బంపర్ డ్రాలో మీరు లక్కీ విన్నర్​గా(cheating in name of lucky winner of car) ఎంపికయ్యారు.. రూ. 10 లక్షల విలువ చేసే కారు సొంత చేసుకున్నారంటూ.. సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి పాల్పడ్డారు. కానీ.. కారు మీకు పంపించాలంటే టాక్స్ చెల్లిస్తే సరిపోతుందని మాయ మాటలు చెప్పి రూ. 30 వేలు దోచుకున్న ఘటన గుంటూరులో చోటుచేసుకున్నారు. బాధితురాలు గుంటూరు అరండల్ పేట పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

గుంటూరు ద్వారకా నగర్​కు చెందిన ఓ మహిళకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి మీరు లక్కీ విన్నర్​గా ఎంపికయ్యారు.. బంపర్ డ్రాలో మీరు 10 లక్షల విలువ చేసే కారు గెలుపొందారంటూ మాయ మాటలు చెప్పారు. కారును పంపించడానికి ముందుగా రూ. 30 వేలు టాక్స్ కట్టాల్సి ఉంటుందని ఆమెను నమ్మించారు. వారి మాటలు నిజమే అని నమ్మిన భాదితురాలు నిందితులు ఇచ్చిన అకౌంట్ నెంబరుకు రూ. 29,960.. తన ఎస్​బీఐ ఖాతా నుంచి బదిలీ చేశారు. డబ్బు పంపిన తరువాత నిందితుల ఫోన్ నంబరు స్విచ్​ఆఫ్​ రావడంతో మోసపోయానని గ్రహించింది.

ఇదీ చదవండి:

Amravati Farmers: 'ముఖ్యమంత్రి దిగొచ్చే వరకు ఉద్యమం చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details