ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అవమాన భారంతోనే కోడెల బలవన్మరణం: చంద్రబాబు - chandrabbabu comments on kodela demise

అవమాన భారంతోనే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన మరణవార్త విని చాలా బాధపడుతున్నట్లు తెలిపారు. సహచరుడిని కోల్పోయిన బాధను తట్టుకోలేకపోతున్నా భావోద్వేగానికి లోనయ్యారు.

chandrabbabu comments on kodela demise

By

Published : Sep 16, 2019, 5:00 PM IST

Updated : Sep 16, 2019, 6:47 PM IST

కోడెల బలవన్మరణంపై.. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకత్వం, శ్రేణులు సంతాపం తెలిపాయి. అధినేత చంద్రబాబు.. తీవ్ర ఆవేదన, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కోడెల ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కొన్నాళ్లుగా కోడెల చాలా మానసిక క్షోభ అనుభవించారని.. చివరికి ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారనే విషయం జీర్ణించుకోలేకపోతున్నా అని వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకుని చాలా బాధపడ్డట్టు చెప్పారు. పేదల డాక్టర్‌గా ఎన్నో వైద్యసేవలు అందించారని కొనియాడారు. కోడెలకు ఎప్పుడూ భయం అంటే ఏమిటో తెలియకపోయినా... ఎప్పుడు, ఏ అవమానం చేస్తారనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.

babu
Last Updated : Sep 16, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details