ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసుల అరాచకాలు ఎండగడతా:చంద్రబాబు - చంద్రబాబు

గతంలో తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ చేసిన అరాచకాలకు అధికారులే బలైన విషయం పోలీసులు గ్రహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హితవు పలికారు. తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులతో ఇప్పుడు మళ్లీ అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

పోలీసుల అరాచకాలు ఎండగడతా:చంద్రబాబు

By

Published : Oct 4, 2019, 7:01 AM IST

ఇష్టానుసారం తెదేపా కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన దెందులూరు కార్యకర్తలతో ఆయన విడిగా సమావేశమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు మొరపెట్టుకున్నారు. ప్రభాకర్​తో పాటు తెదేపాలో చురుకైన కార్యకర్తలపైనా ఎస్సీ, ఎస్టీ కేసులను మోపుతూ హింసిస్తున్నారని తెలిపారు. పోలీసులు హద్దుల్లో వ్యవహరించాలని చంద్రబాబు హితవు పలికారు.

పోలీసుల అరాచకాలు ఎండగడతా:చంద్రబాబు
తమకు చంద్రబాబు నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని, ఎట్టి పరిస్థితిలోనూ తెదేపాను విడిచిపెట్టమని కార్యకర్తలు స్పష్టం చేశారు. దెందులూరు కార్యకర్తల ఆవేదనను విన్న చంద్రబాబు వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను స్వయంగా దెందులూరు వచ్చి వైకాపా నేతలు, పోలీసుల అరాచకాలను ఎండగడతానని తెలిపారు. ఇప్పటి వరకూ 172 వివిధ రకాల అక్రమ కేసులు, 10 ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి హింసించడం పోలీసులకు తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details