అందరికీ ఆహారభద్రత కల్పించాలన్నది తెదేపా ప్రధాన లక్ష్యమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ లక్ష్యంతోనే కిలో రూ.2 బియ్యం, అన్న క్యాంటీన్లు అమలుచేశామన్నారు. గతప్రభుత్వంలో అమృతహస్తం, బాలామృతం, ఆహారబుట్ట, రంజాన్ తోఫా వంటివి తెచ్చామన్నారు. పేదప్రజలకు ఉపయోగపడే ఇలాంటి పథకాలన్నింటినీ వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందన్నారు చంద్రబాబు. అన్న క్యాంటీన్లు సహా అన్ని ఆహార పథకాలను పునరుద్ధరించాలన్నారు. ఇవాళ ప్రపంచం ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్న చంద్రబాబు... ఇప్పటికైనా ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి ఆహారభద్రత కల్పించాలని ట్విటర్ ద్వారా కోరారు.
పేదప్రజల ఆహారభద్రతే తెదేపా ప్రధాన లక్ష్యం : చంద్రబాబు - ఆహార భద్రతపై వార్తలు
పేదప్రజలందరికీ ఆహారభద్రత కల్పించాలనే లక్ష్యంతో గతంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ట్విట్ చేసిన ఆయన... పేద ప్రజల ఆహారభద్రత కోసం తెదేపా తీసుకొచ్చిన పథకాల్ని రద్దు చేయడం సమంజసంకాదన్నారు. పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పేదప్రజల ఆహారభద్రతే తెదేపా ప్రధాన లక్ష్యం : చంద్రబాబు