బ్రహ్మయ్య.. అజాత శత్రువు.. నిస్వార్థ నాయకుడు: చంద్రబాబు - chandrababu on brahmaiah demise
మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మరణం.. బాధాకరమన్నారు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు.
chandrababu
మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మృతిపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో.. బ్రహ్మయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన అజాత శత్రువని.. పార్టీ కోసం నిస్వార్థంగా అనుక్షణం పనిచేసిన నాయకుడని కీర్తించారు. అంత్యక్రియలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పంపించినట్టు చెప్పారు. బ్రహ్మయ్య కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.