రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యనేతలు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మహిళలకు రక్షణ లేదనడానికి, విజయవాడ ఘటన శాంతిభద్రతల పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. దిశ చట్టం తెచ్చినట్లు వైకాపా గొప్పలు చెప్పుకుంటోందన్న చంద్రబాబు... లేని చట్టానికి ఏడాదిన్నరగా పోలీస్‌స్టేషన్లు, సమీక్షలా అని ప్రశ్నించారు. వరదలకు పంట నష్టపోయిన రైతులను పలకరించే నాథుడే లేడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులను అప్పులపాలు చేశారని విమర్శించారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని, భవన కార్మికులకు ఉపాధి పోగొట్టారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: చంద్రబాబు - chandrababu comments on Jagan
వైకాపా ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు. రైతులను అప్పులపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
చంద్రబాబు