ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"వైఎస్​ వెనక్కి తీసుకున్న జీవోకు.. జగన్ పదును" - chandra babu over media sanctions

పత్రికా స్వేచ్ఛను బెదిరించి బ్లాక్​మెయిల్ చేయాలనుకోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. విజ్ఞతతో రాజశేఖర్ రెడ్డి ఎందుకు జీవోను ఉపసంహరించుకున్నారో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు

By

Published : Oct 18, 2019, 1:56 PM IST

మీడియా సమావేశంలో చంద్రబాబు

మీడియాపై ఆంక్షలు విధిస్తూ గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకున్నారని... అయితే సీఎం జగన్‌ మాత్రం అహంభావంతో ముందుకెళ్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైఎస్​ వెనక్కి తీసుకున్న జీవోకు మరింత పదునుపెట్టి జగన్‌ కేబినెట్‌లో ప్రవేశపెట్టారని ఆరోపించారు. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. విజ్ఞతతో రాజశేఖర్ రెడ్డి జీవోను ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. 5 నెలల కాలంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసి.. ఇప్పుడు మీడియాను నియంత్రించాలనుకోవటం తగదని హెచ్చరించారు. వైఎస్ హయాంలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసి అనంతరం ఉపసంహరించుకున్న వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. ఈ అంశంపై అప్పటి సీఎం వైఎస్సార్‌ మాట్లాడటాన్ని సైతం వీడియో రూపంలో ప్రదర్శించారు. నెల్లూరులో ఓ విలేఖరిని వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దానికి సంబంధించిన ఆడియో టేప్‌ను వినిపించారు. ఓ హోంగార్డును మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బెదిరించారని మండిపడ్డారు. తెదేపా ఎమ్మెల్యేలు వస్తే డీజీపీ ఆఫీస్​లో ఉండరనీ... వైకాపా వాళ్లు వస్తుంటే ఎదురువెళ్లి స్వాగతం పలుకుతారని చంద్రబాబు ఆరోపించారు. తనకు నోటీసులు ఇస్తానని డీజీపీ అనటాన్ని తప్పుబట్టిన చంద్రబాబు... ఎన్ని ఇస్తారో ఇవ్వండి చూస్తానని సవాల్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details