తన జీవితంలో అడుగడుగునా కులవివక్షను ఎదుర్కొంటూనే, తెలుగు సాహితీలోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, దళితాభ్యుదయవాది గుర్రం జాషువాగారు. సమసమాజ నిర్మాణ స్ఫూర్తిప్రదాత గుర్రం జాషువా 124వ జయంతి సందర్భంగా, ఆ దార్శనికుని సంఘ సంస్కరణ పోరాటాన్ని, ఆ మహాకవి సాహితీ సేవను స్మరించుకుందాం.
-నారా చంద్రబాబు నాయుడు
గుర్రం జాషువాకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు - chandrababu and lokesh tribute to gurra jashuva
గుర్రం జాషువా 124వ జయంతి సందర్భంగా ఆయనకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులు అర్పించారు.
chandrababu and lokesh tribute to gurra jashuva
ప్రఖ్యాత సాహితీవేత్త, సామాజిక రచయిత, తన కవిత్వంతో మూఢాచారాలపై పోరాడిన నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ స్వర్గీయ గుర్రం జాషువాగారి జయంతి రోజున ఆ మహనీయుడు దళితాభ్యుదయానికి చేసిన కృషిని స్మరించుకుంటూ, ఆ మహాకవి స్మృతికి నివాళులర్పిస్తున్నాను.
- నారా లోకేశ్
ఇదీ చదవండి: జాషువాకు సేవ చేశాడు...సాహిత్యాన్ని కాపాడుతున్నాడు!